సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’. స్టోరీ క్యాట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఒరిజినల్స్ అసోసియేషన్ విత్ ఎం.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుభాష్ చంద్ర దర్శకత్వంలో ప్రవీణ్ నంబారు, సజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ, ‘సుభాష్ ఈ సినిమాకు న్యాయం చేశాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది. సంతోష్ శోభన్‌లో ఎంతో ఈజ్ ఉంటుంది. ప్రేక్షకులను కూడా జోరుగా హుషారుగా షికారు పోదమ అనేలా తీసుకెళ్తారని అనుకుంటున్నాను’ అని అన్నారు. ‘దర్శకుడు సుభాష్ సినిమాని అద్భుతంగా తీశాడు. ప్రేక్షకుడికి విజువల్స్ కనిపిస్తాయి. కానీ నిర్మాతగా నాకు నా టీం కష్టం కనిపిస్తుంది’ అని నిర్మాత ప్రవీణ్ చెప్పారు. దర్శకుడు సుభాష్ చంద్ర మాట్లాడుతూ,’లైట్ హార్టెడ్ ట్రావెల్ మ్యూజికల్ లవ్ స్టోరీ. ఈ సినిమాను చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకుంటారు. ఇండియా మొత్తం చుట్టి వచ్చినట్టుగా ఉంటుంది’ అని తెలిపారు. ‘స్వీట్ సింపుల్ ట్రావెల్ రోమ్ కామ్ సినిమా. ప్రవీణ్‌లో పెద్ద నిర్మాత అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనతో మళ్లీ సినిమా చేయాలని ఉంది’ అని హీరో సంతోష్ శోభన్ చెప్పారు.