హాయిగా నవ్వుకుంటారు..

They laugh comfortably..కామ్రేడ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్‌ టైనర్‌ ‘కిస్మత్‌’. నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, విశ్వ దేవ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రియా సుమన్‌ కథా నాయికగా నటిస్తుండగా, సిహెచ్‌ భానుప్రసాద్‌ రెడ్డి సహ నిర్మాత. ఆదివారం ఈ చిత్ర టీజర్‌ను హీరో శ్రీవిష్ణు లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా నరేష్‌ అగస్త్య మాట్లాడుతూ,’ఇలాంటి సినిమాలన్నీ మౌత్‌ టాక్‌ వల్లే హిట్‌ అవుతాయి. ఈ సినిమా నవంబర్‌లో విడుదలౌతుంది’ అని తెలిపారు. ‘ఓ మంచి హిలేరియస్‌ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని దర్శకుడు శ్రీనాథ్‌ బాదినేని చెప్పారు. అభినవ్‌ గోమఠం మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి కిస్మత్‌ అనే పేరు పెట్టడానికి కారణం ఆ పాత్రల్లో మస్త్‌ కిస్మత్‌ ఉంది. ఇది చాలా మంచి క్రైమ్‌ కామెడీ. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుంటారు’ అని అన్నారు.