మంచి ప్రభుత్వం కోసం ఆలోచించండి

– భగత్‌ గెలుపు బాధ్యత మీది.. అభివృద్ధి బాధ్యత నాది
– జానారెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు
– ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌
నవతెలంగాణ -మిర్యాలగూడ
మన తలరాతను మార్చేది ఓటు హక్కు.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కీలకం.. అలాంటి ఓటుని ఆలోచించి మంచి నాయకుడికి వేసి ఎన్నుకోవాలి.. ఇందులో ప్రజలు హడావుడి పడవద్దని, గడివిడ కావద్దని ఆలోచించి ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని అనుములలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. మాయమాటలతో కాంగ్రెస్‌ వాళ్ల వస్తున్నారని, వాళ్లని నమ్మి మోసపోవద్దని కోరారు. ఇక్కడ బీఆర్‌ఎఫ్‌ అభ్యర్థి నోముల భగత్‌ కుమార్‌ విద్యావంతుడని ఎల్‌ఎలీబీ చేశాడని తెలిపారు. నియోజవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఇలాంటి వారిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపాలని కోరారు. ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన జానారెడ్డి రోడ్డు తప్ప నియోజవర్గ అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఆయన హయాంలో కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సాధించుకున్నామని గుర్తు చేశారు. 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా పెంచుకున్నామని, నియోజకవర్గంలో పంట భూముల సస్యశ్యామలమయ్యేందుకు రెండు లిఫ్ట్‌ ఇరిగేషన్లు మంజూరు చేసుకున్నామని తెలిపారు అందులో ఒకటి ప్రారంభించుకున్నామని, మరొకటి త్వరలో ప్రారంభించుకుంటామని ఆ ప్రారంభోత్సవానికి తానే వస్తానని చెప్పారు.నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్యే నోముల భగత్‌ నిత్యం తపించే వారని నోములను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే నియోజవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటారని చెప్పారు. భగత్‌ కోరికలన్నీ తీరుస్తారని హామీ ఇచ్చారు. మార్చి తర్వాత రేషన్‌ కార్డు ఉన్నవారందరికీ సన్న బియ్యం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మళ్లీ అధికారంలోకి తాగుతున్నామని సౌభాగ్య లక్ష్మి, 400 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, ప్రతి సంవత్సరం పెన్షన్‌ పెంపు, వంటి పథకాలు అమలు చేస్తామన్నారు. మతిదారుల, మత్స్య కార్మికుల అభివృద్ధికి ఎంతో కషి చేస్తున్నామని గొర్ల పెంపకానికి ప్రోత్సహించి 30 వేల కోట్ల మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ రద్దు, రైతుబంధుకు రాం రాం, దళిత బంధు జైభీం అవుతుందన్నారు. దానివలన మళ్లీ దళారీల రాజ్యం వస్తుందని పొరపాటున కూడా కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వొద్దని చెప్పారు. ఆలోచించి ఓటు వేస్తే లాభం జరుగుతుందని హైదరాబాదులో మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని దానికోసం ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు, బడుగుల లింగ యాదవ్‌, ఎమ్మెల్యే నోముల భగత్‌ కుమార్‌, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకా చైర్మన్‌ రామచంద్రనాయక్‌,ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.