అందమైన గ్రామీణ నేపథ్య ప్రేమకథ..

అందమైన గ్రామీణ నేపథ్య ప్రేమకథ..వినాయక్‌ దేశారు, అపర్ణా దేవీ హీరో, హీరోయిన్లుగా గోనల్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్‌ వెంకట్‌ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్‌ ప్రమోషన్‌ను ప్రారంభించింది.
ఇందులో భాగంగా మూవీ ఫస్ట్‌ లుక్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘వినాయక్‌కు లీడ్‌గా ఇది రెండో చిత్రం. పోస్టర్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంది. కంటెంట్‌ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఎంకరేజ్‌ చేస్తారు. పోస్టర్‌ నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అని తెలిపారు.
‘ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన రాజ్‌ కందుకూరికి థ్యాంక్స్‌. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలి’ అని హీరో వినాయక్‌, దర్శక, నిర్మాతలు ఇస్సాకు, వెంకటేష్‌ చెప్పారు. రౖటర్‌ వసంత్‌ వెంకట్‌ బాలా మాట్లాడుతూ.. ‘నన్ను సపోర్ట్‌ చేసిన మా టీమ్‌కి థ్యాంక్స్‌. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : చైతు కొల్లి, కెమెరామెన్‌ : తాజ్‌ జీడీకే, ఎడిటర్‌ : కే రమేష్‌, ఫైట్స్‌ : రాబిన్‌ సుబ్బు.

Spread the love