ఇది.. జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే

నందమూరి బాలకష్ణ, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, షైన్‌ స్క్రీన్స్‌ ప్రొడ్యూసర్స్‌ సాహు గారపాటి, హరీష్‌ పెద్ది కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’. ఐ డోంట్‌ కేర్‌ అనేది ట్యాగ్‌ లైన్‌ ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ రెండు రోజుల క్రితం విడుదలై టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ అందుకుంది. తాజాగా బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్‌ ఈ చిత్ర టీజర్‌ను లాంచ్‌ చేశారు. టీజర్‌ ప్రపంచవ్యాప్తంగా 108కి పైగా థియేటర్లలో స్క్రీన్‌ చేశారు. టీజర్‌ని పెద్ద స్క్రీన్‌లపై చూడటం అభిమానులకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘రాజు అహంకారానికి, మొండివాడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాలకష్ణ వివరించడంతో టీజర్‌ ప్రారంభమవుతుంది. అర్జున్‌ రాంపాల్‌ను రూలర్‌గా పరిచయం చేయగా, బాలకష్ణను మొండివాడిగా చూపించారు. ‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్‌ కేసరి’ అని తనను తాను పరిచయం చేసుకున్నారు బాలయ్య. ‘ఈ పేరు శానా యేండ్లు యాదుంటది’ అని బాలకష్ణ చెప్పినట్లుగానే ఇది చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ,’రౌడీఇన్స్పెక్టర్‌ సినిమాలో బాలయ్య బాబు హిందీ డైలాగులు చెబితే థియేటర్లు దద్దరిల్లాయి. తెలంగాణ నేపథ్యం కావడంతో ఇందులో కూడా అక్కడక్కడ కొన్ని హిందీ డైలాగులు పెట్టాం. టీజర్‌లో సర్‌ప్రైజ్‌గా హిందీ డైలాగ్‌ ఇచ్చాం. బాలకష్ణ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారనేదానికి టీజర్‌ జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే. దసరాకి భగవంత్‌ కేసరి ఎంటర్‌ టైన్‌మెంట్‌ మామూలుగా ఉండదు. అభిమానులతో పాటు తెలుగు సినిమాని ప్రేమించే ప్రేక్షకులందరూ ఈ సినిమాను కచ్చితంగా ఎంజారు చేస్తారు’ అని చెప్పారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ,’ఇది మేము అభిమానులకు ఇచ్చే కానుక. దసరాకి వస్తున్నాం. దర్శకుడు అనిల్‌ రావిపూడి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా సినిమాని తీర్చిదిద్దారు. ఈ దసరాకి అన్ని రికార్డులు భగవంత్‌ కేసరి సొంతం చేసుకుంటుంది. మేము అభిమానులుగా అభిమానులకు ఇచ్చే సినిమా భగవంత్‌ కేసరి’ అని చెప్పారు. మరో నిర్మాత హరీష్‌ మాట్లాడుతూ, ‘ఇది శాంపిల్‌ మాత్రమే. ఈ దసరాకి మీ అందరినీ ఉత్సాహపరుస్తాం’ అని తెలిపారు.