జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తోట లక్ష్మీకాంతరావు ప్రకటన

– నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదు సార్లు ఓడిపోయిన సౌదాగర్ గంగారాం కు ఐ కమాండ్ నో

నవతెలంగాణ- మద్నూర్
కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ కాన్స్టెన్సీ అయినా జుక్కల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ ఆలస్యం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో గత నెల రోజులుగా ఎదురుచూపులతో ఉత్కంఠ గా కొనసాగగా ఎట్టికేలకు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ సోమవారం రాత్రి జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తోట లక్ష్మీకాంతరావు పేరును ప్రకటిస్తూ తెరదించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున జుక్కల్ నుంచి పోటీ చేసేందుకు తోట లక్ష్మీ కాంతారావు ఇంచుమించు సంవత్సర కాలంగా జుక్కల్ నియోజకవర్గం లో పర్యటిస్తూ కొన్ని అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం అందించడం అందరిలో తోటా లక్ష్యం కాంత్రావు కొద్ది కాలంలోనే గుర్తింపు పొందడం విశేషం తనకున్న పట్టుదలతో టికెట్ కోసం పట్టు విడని విక్రమార్కునిగా నిలవడం జరిగింది. జుక్కల్ నియోజకవర్గం లో సౌదాగర్ గంగారం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటారు జుక్కల్ అసెంబ్లీ 1978 ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీగా ఏర్పడిన నాటినుండి నేటి వరకు  సౌదాగర్ గంగారం కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ ఇప్పటివరకు జరిగిన పది సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తూనే వస్తున్నారు. తొమ్మిది సార్లు టికెట్ సాధించుకోగా వాటిలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఐదు సార్లు ఓడిపోయారు ఒకసారి టిక్కెట్టు ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడంతో అప్పట్లో ఇక్కడ పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అరుణాతార ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి రాజేశ్వర్ ఓడిపోయారు. ఈసారి జరిగే ఎన్నికల్లో సౌధగర్ గంగారం టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ ఐకమండ్ తోటా లక్ష్మి కాంత్ పేరు ప్రకటించడం జరిగింది. ఈసారి కూడా సౌధాగర్ గంగారం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటారా లేదా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నది వేచి చూడాలి.