ఆ అభ్యర్థులకు మూడు మార్కులు

– ఎంసెట్‌ కన్వీనర్‌ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఈనెల 14న నిర్వహిం చిన ఐదు, ఆరు విడతలకు హాజరైన అభ్యర్థులకు అధికారులు మూడు మార్కుల చొప్పున కలిపారు. ఈ మేరకు ఎంసెట్‌ కన్వీనర్‌ బి డీన్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆ రెండు విడతల్లో మ్యాథ్స్‌ ప్రశ్నాపత్రంలో మూడు ప్రశ్నలు తప్పుగా రావడంతో ఆ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు మూడు మార్కుల చొప్పున కలిపినట్టు వివరించారు. అయితే ఈనెల 12,13 తేదీల్లో ఒకటి, రెండు, మూడు, నాలుగు విడతలకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి మార్కులు కలపలేదని స్పష్టం చేశారు.