ఇంజక్షన్‌ వికటించి..మూడు నెలల బాబు మృతి

నవతెలంగాణ-కేసముద్రం రూరల్‌
ఇంజక్షన్‌ వికటించి మూడు నెలల బాబు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… రంగాపురం గ్రామానికి చెందిన వీరన్న- లక్ష్మీ దంపతుల మూడు నెలల బాబుకు జ్వరం వచ్చింది. దాంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు ఆలీ బాబు వద్దకు తీసుకువెళ్లారు. వైద్యుడు వేసిన ఇంజక్షన్‌ వికటించడంతో మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడని బాధితులు తెలిపారు.