నకిరేకల్ లో తొలి రోజు ముగ్గురు నామినేషన్లు 

నవతెలంగాణ- నకిరేకల్:
నకిరేకల్ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం తొలి రోజు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కావడం గమనార్హం. స్వతంత్ర అభ్యర్థులుగా నూనె వెంకటస్వామి, చినేని లక్ష్మయ్య, రేఖల  సైదులు నామినేషన్లు దాఖలు చేసినట్టు సహాయ రిటర్నింగ్ అధికారి జి ప్రసాద్ తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.