మొదటిరోజు మూడు నామినేషన్లు దాఖలు

నవతెలంగాణ – చండూరు:
 ఈనెల 30న జరగనున్న  అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు  ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు   బేరి  వెంకటేష్,మాధగోని  వెంకటేశ్వర్లు, బుషిపాక వెంకటయ్య ఒక్కొక్క సెట్టు వేసి మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో  దామోదరావుకు శుక్రవారం  అందజేశారు.
ఆర్వో కార్యాలయం ముందు 144 సెక్షన్ అమలు..
స్థానిక గుండ్రపల్లి   రోడ్ లో ఉన్న ఆర్వో కార్యాలయం ముందు 100 మీటర్ల పరిధిలో  పోలీసులు గట్టి బందోబస్తు, బార్ గేట్లు   ఏర్పాటు చేశారు. పరిధిలో ఉన్న దుకాణాలను మూసివేశారు. గతంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 2008 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అదనంగా మరో 9 పోలింగ్ కేంద్రాలు నూతనంగా ఏర్పాటు చేశారు. నగదు, బంగారం ఇతరత్రా వస్తువుల సర ఫరాపై నిఘా ఉంచేందుకు చండూరు మండలం ఉడతలపల్లి, మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి, మునుగోడు మండలం గూడపూర్, చౌటుప్పల్ మండలం తూప్రాస్పెట గ్రామ శివారుల్లో ప్రధాన చెక్ పోస్టులను ఏర్పాటు  చేసినట్లు ఎన్నికల రన్నింగ్ అధికారి   దామోదర్ రావు తెలిపారు.ప్రతి చెక్ పోస్టు దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో 112 గ్రామాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు ఇక్కడ ప్రత్యేక పోలీసులతో నిఘా  పెట్టారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు వీడియో బృందాలు, 9 బృందాలు పనిచేస్తున్నాయి. ఆర్డీఓ కార్యా లయం వద్ద ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్ఎస్ఐలు, 40 మంది పోలీస్ సిబ్బంది పర్వ వేక్షణ ఉంటుంది. ఆర్టీ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 2,48,377 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,24,434 మహిళలు 1,23,938 ఉన్నారు. నామినేషన్ల ఫారం పూర్తి చేయడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా  మునుగోడు ప్రజలు సహకరించాలని ఆర్వో దామోదర్ రావు  తెలిపారు.