
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కే మళ్ళీ టికెట్ మళ్లీ కేటాయించడం పట్ల వివిధ మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. తెలంగాణలో ఆదర్శంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి దూసుకుపోతున్న పోచారం ఈసారి మరింత భారీ మెజార్టీతో గెలుపొందనున్నట్లు దీమా వ్యక్తం చేస్తున్నారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. 1994 నుంచి ఇప్పటి వరకు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ఈ ప్రాంత అభివృద్ధి కి కృషి చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పాల్త్య విఠల్, మండల పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కంది మల్లేష్, నాయకులు, తదితరులు హాజరయ్యారు.