డిగ్రీ పరీక్షలు పూర్తయ్యేవరకు

– సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ వాయిదా వేయాలి
– ప్రభుత్వానికి కానిస్టేబుల్‌ క్వాలిఫై అభ్యర్ధులు వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డిగ్రీ పరీక్షలు పూర్తయ్యేవరకు సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ వాయిదా వేయాలని కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్ధులు ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. కానిస్టేబుల్‌ పోస్టులకు అర్హత సాధించినవారిలో ఎక్కువ మంది డిగ్రీ చదువుతున్న వారు ఉన్నారనీ, ఈనెల 13 నుంచి డిగ్రీ పరీక్షలు ఉన్నందున 14నుంచి 26వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు తమకు ఇబ్బందిగా ఉంటుందని, వినతిని పరిశీలించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
పరీక్షల తర్వాతే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించాలి : డివైఎఫ్‌ఐ
డిగ్రీ పరీక్షల తర్వాతే కానిస్టేబుల్‌ సెలెక్ట్‌ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించాలని డివైఎఫ్‌ఐ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈమేరకు డివైఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్‌, అనగంటి వెంకటేష్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.