కోదండరాం పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు-టీజేఎస్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రొఫెసర్‌ కోదండరాం పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేశ్‌, ధర్మార్జున్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కోదండరాం పోటీపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదనీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని స్పష్టం చేశారు. తమ పార్టీ కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఆందోళనలను నిర్మించే పనిలో నిమగమై ఉన్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.