పశుసంవర్ధక శాఖలో శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

– టీఎస్‌ ఎల్డీఏ చైర్మన్‌ రాజేశ్వరరావుకు వినతి
నవతెలంగాణ – ములుగు
గోపాలమిత్రలను పశు సంవర్ధకశాఖలో శాశ్వత ప్రతి పాధికన విలీనం చేస్తూ కనీస వేతనం ఇప్పించాలని గోపాలమిత్రల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు మారబోయిన రవీందర్‌ విజ్ఞప్తి చేశారు. ఆదివారం కరీంనగర్‌ లో తెలంగాణ రాష్ట్ర పషుగణాభివద్ది సంస్థ రాష్ట్ర చైర్మన్‌ చలమడ రాజేశ్వరరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గోపాలమిత్రుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మారబోయిన రవిందర్‌ మాట్లాడుతూ గోపాల మిత్రల సమస్యల పరిష్కారం కొరకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 23 సంవత్సరాలుగా రాష్ట్రంలోని పశుగనాభివృద్ధి సంస్థ ద్వారా గ్రామాలలో ఉంటూ పశు పోషకులు పాడి పశువులకు రైతుల ఇంటి ముందరే కృత్తిమ గర్భాదారణ సేవలిందిస్తూ మేలు జాతి దూడల అభివృద్ధి చేస్తూ పాల ఉత్పత్తి పెంపకంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టె గొర్రెల, మేకల, గేదెల పంపిణి పథకాలను రైతులకు విస్తత ప్రచారం చేస్తున్నామన్నారు. పశువులకు అన్ని రకాల అనారోగ్య సమస్యలు తీర్చడంలో సేవలందిస్తున్న గోపాల మిత్రలైన తమకు గౌరవ వేతనాన్ని రూ.3,500 నుండి రూ.8,500 వరకు పెంచి, 30 శాతం పిఅర్సి కూడా ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమను పశుసంవర్ధక శాఖలో శాశ్వత ఉద్యోగులుగా గుర్తించే విధంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం చైర్మన్‌ మాట్లాడుతూ గోపాల మిత్రల సమస్యలను పరిష్కరిం చడంలో తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల గోపాలమిత్రులు లక్ష్మినారా యణ, మధు, చారి,సాంబశివ రావు, నర్సింహ,సుమన్‌,సత్య నారాయణ,మహేష్‌, తిరుమల రాజేశం, తిరుపతి, రాంరెడ్డి, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.