ఎదగాలంటే..?

ఎదగాలంటే..?కెరీర్‌ అయినా, వ్యాపారమైనా మేమూ ఎవరికీ తీసిపోము అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. టాప్‌లో నిలవడానికి ఎంత కష్టపడటానికైనా సిద్ధమంటున్నారు. ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి విజేతల జీవితాల గురించి తెలుసుకుంటున్నారు. – ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి. కొన్నిసార్లు సమయం వెంట పరుగెత్తి టాస్క్‌లు పూర్తి చేయాల్సి వస్తుంది. అది సహజమే. చాలా సమయం ఉందని కూర్చోవడం, ఫోన్లు, చాటింగ్‌లు, ఇతర వ్యాపకాలు చూసుకుంటూ ఆఖర్లో పరుగులు తీస్తోంటే మాత్రం మీ తోరు మార్చుకోవాల్సిందే.
– ఎంత మెరుగ్గా పని చేస్తున్నారన్నదే ముఖ్యం. మనకు ఇల్లు, పిల్లలు బాధ్యతలు అదనమే అయినా, వాటి సాకుతో పని చేయకపోవడం, పొరపాట్లకు తావిస్తానంటే కుదరదు. – ‘అమ్మో తప్పులొస్తాయి’ అని ప్రతిదానికీ వెనకాడొద్దు. కచ్చితత్వానికి మారుపేరైన సాంకేతికత కూడా కొన్ని సార్లు పొరపాటు చేస్తుంది. మనుషులం కావాలని కాకపోయినా తెలియకుండానే పొరపాట్లు జరుగుతాయి. అలాగని భయపడుతూ ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఎలా నమ్ముతారు. నాయకురాలవ్వడానికి, పొరపాట్లకు బాధ్యత వహించడానికి వెనకాడొద్దు. తప్పులకకు వెరవక వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే చాలు.. అప్పుడు ఆగిపోవడమన్న మాటే ఉండదు.