మెడ మెరిసిపోవాలంటే…

మెడ మెరిసిపోవాలంటే...ఎక్కువగా బయట తిరుగుతుండటంతో ఎండకు మెడ చుట్టూ నల్లగా మారుతుంది. ఈ డార్క్‌ స్పాట్‌లను హైపర్‌పిగ్మెంటేషన్‌ అంటారు. అకాంథోసిస్‌ నైగ్రికన్స్‌ అనే హార్మోన్ల సమస్య కూడా తరచుగా మెడపై నల్లటి పాచెస్‌కు కారణమవుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి చాలా మంది మార్కెట్‌లో దొరికే సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. కానీ, కొన్ని హోం రెమిడీస్‌తో నల్లమచ్చలను పోగొట్టుకోవచ్చు.
అలోవెరా – దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. తాజా కలబంద ఆకుల నుండి తీసిన గుజ్జును మెడ చుట్టూ అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడగాలి.
బేకింగ్‌ సోడా – రెండు చెంచాల బేకింగ్‌ సోడాను నీటిలో కలపండి. నల్ల మచ్చలపై రాయండి. అది ఆరిన తర్వాత… తడి వేళ్లతో స్క్రబ్‌ చేయండి. ఆ తర్వాత తప్పకుండా మాయిశ్చరైజర్‌ అప్లై చేయండి.
బంగాళాదుంప రసం – బంగాళాదుంపలో బ్లీచింగ్‌ లక్షణాలు ఉన్నాయి, ఇవి చర్మపు రంగును కాంతివంతం చేస్తాయి. ఒక బంగాళాదుంపను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీలో పేస్టు చేసుకోవాలి. దాన్ని వడకట్టి వచ్చిన రసాన్ని నల్ల మచ్చపై అప్లై చేయండి. పూర్తిగా ఆరిపోయాక నప్పుడు, నీటితో కడగాలి.
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ – యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ చర్మం యొక్క జూనని బ్యాలెన్స్‌ చేస్తుంది. ఇందులో ఉండే మాలిక్‌ యాసిడ్‌ మత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని తాజాగా మారుస్తుంది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను కొద్దిగా నీళ్లలో కలిపి మెడ చుట్టూ పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.