ఈ రోజుల్లో డార్క్ సర్కిల్స్ (కండ్ల కింద నల్లటి వలయాలు) తో బాధపడే వారు చాలా మందే ఉన్నారు. అసలు ఈ కండ్ల చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలకు కారణాలనేకం. ఒక్కొక్కరికి ఒక్కో పరిస్థితి వల్ల ఇవి ఏర్పడుతుంటాయి. అందులో మొదటి కారణం అలసట. కండ్లు ఎక్కువగా శ్రమిస్తే అలసట ఏర్పడుతుంది. ఫలితంగా ఈ వలయాలు ఏర్పడతాయి. ఎక్కువ సేపు ఫోన్ చూడటం, కంప్యూటర్ ఎక్కువగా వాడటం, రాత్రిళ్లు మెలకువగా ఉండటం, సరిగా నిద్రపోకపోవడం, అతిగా ఆలోచించి స్ట్రైన్ అవ్వడం వంటి కారణాలన్నీ అలసటకు కారణమవడంతో పాటు, డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. ఇవి పెద్ద సమస్యేమి కానప్పటికీ అందాన్ని పాడుచేస్తాయి. ఇవి ఏర్పడేందుకు కారణాలు, వాటి నివారణకు ఏమేం చేయాలో తెలుసుకుందాం.
– రక్తనాళాలను ప్రభావితం చేసే రక్తహీనత, థైరాయిడ్ సమస్యల కారణంగా ఈ డార్క్ సర్కిల్స్ వస్తాయి.
– డీహైడ్రేషన్ వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ డార్క్ సర్కిల్స్ కారణంగా చర్మం నల్లగా మారుతుంది.
– సూర్యరశ్మి కారణంగా దీని వల్ల చర్మం గోధుమ, నల్లగా మారుతుంది. ముదురు రంగు చర్మం ఉన్నవారికి హైపర్ పిగ్మంటేషన్, చర్మం మెలనిన్‌ని ఉత్పత్తి చేస్తుంది.
– కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడటానికి మెలనిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. సూర్యరశ్మి, హైపర్ పిగ్మంటేషన్, కొన్ని మెడిసిన్ కూడా డార్క్ సర్కిల్స్ కారణం కావొచ్చు.
– గ్లకోమా ట్రీట్‌మెంట్‌కి కొన్ని కంటి హైపోటెన్సివ్ మెడిసిన్, లాటానోప్రోస్ట్, బైమాటోప్రోస్ట్ వంటివి కూడా కళ్ళ చుట్టూ నల్లని రంగు పెరగడానికి కారణమవుతుంది.
– కెఫిన్, ఆల్కహాల్ వంటివి కూడా డార్క్ సర్కిల్స్‌కు కారణాలే.
– పడుకునే ముందు టీవీ, ఫోన్ వంటి స్క్రీన్స్ చూడడం వల్ల సమస్య పెరుగుతుంది.
నివారణకు…
– అన్నింటిలో మొదటిది, నల్లని వలయాలని తగ్గించేం దుకు బాగా నిద్ర పోవాలి. దీని వల్ల బాడీ, మనసుకి మంచిది.
– ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్ రాస్తుండాలి. ఇది హానికరమైన యూవి కిరణాల నుండి కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన చర్మాన్ని రక్షిస్తుంది. తద్వారా సన్ డ్యామేజ్, అకాల వద్ధాప్యాన్ని నివారిస్తుంది. ఎండలో బయటకు వెళ్లేపుడు సన్ గ్లాసెస్ ఉపయోగిస్తే, అదనపు రక్షణను అందిస్తాయి.
– కీర దోసకాయ ముక్కల్ని కళ్ళపై పెట్టి 10 నిమిషాలు పెట్టాలి. ఈ దోసకాయ ముక్కల కారణంగా కళ్లకు ఒత్తిడి తగ్గి, రక్త నాళాలను చల్లగా చేసి రిఫ్రెష్‌గా ఉంచుతుంది.
ఈ సమస్యని ఇంటి చిట్కాలతో పూర్తిగా తగ్గించలేం. లేజర్ థెరపీ కారణంగా ఈ సమస్య తగ్గుతుంది. ఫిల్లర్స్, హైలురోనిక్ యాసిడ్, ఇంజెక్ష న్స్‌తో ముడతలు తగ్గుతాయి. బ్లెఫరో ప్లాస్టీ, సర్జరీలు, కనురెప్పల నుండి అదనపు చర్మం, కొవ్వు, కండరాలను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా తాజాదనాన్ని అందిస్తుంది.