– పాలకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-తొర్రూర్
ప్రజల రుణం తీర్చుకునేందుకే మళ్లీ పోటీ చేస్తున్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మంగళవారం తొ ర్రూరులో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం ప్రసంగం అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. 40 సంవత్సరాల తన రాజకీయ జీవితం పాలకుర్తి ప్రజలతో ముడిపడి ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాన న్నారు. తనకు ఎక్కడా చెడ్డ పేరు లేదని, తనను మంత్రి అని ఈ ప్రాంత ప్రజలు ఎవరు పిలవరని, దయన్నగా ప్రజల హదయాల్లో చోటు చేసుకున్నానని తెలిపారు. దయన్న ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని, ఆపదలో ఆదు కుంటాడని అన్నారు. ఏసీలో తిరిగేవారు కావాలా… ఎండలో మీతో పాటు తిరిగే మీ దయన్న కావాలా… ఆలోచించుకోవాలన్నారు. నియోజకవ ర్గంలో 10వేలమంది నిరుద్యో గులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. 23 వేల మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించామని చెప్పారు. దేవాదుల ద్వారా 150 గ్రామాలకు సాగునీరు అందించామని, తొర్రూర్ మున్సిపాలిటీ డివిజన్ కేంద్రం చేసుకున్నామని గుర్తు చేశారు. 100 పడకల ఆసుపత్రి తెచ్చుకున్నామని, పెద్దవంగర మండలం చేసుకు న్నామని తెలిపారు. మీ ఆశీర్వాద బలంతోనే ఏ రాష్ట్రంలో జరగని అభివద్ధి తెలంగాణలో పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిందని అన్నారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్ర మంలో మంత్రి సత్యవతి రాథోడ్, పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు, ఎంపీ దయాకర్‌రావు, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సుధాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.