పొగాకు వాడకం పెరిగింది

– ఐపీఎస్‌ చేతన
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
పొగాకు వాడకం రోజురోజుకి పెరిగిపోతుందని దీని నియంత్రించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుం టున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లోపంతో అనారోగ్యాల పాలవుతున్నారని జాయింట్‌ డైరెక్టర్‌ ఏసీబీ చేతన ఐపీఎస్‌ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రావూస్‌ ఓరల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ అండ్‌ డా ఓ” నాగేశ్వరరావు చారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె వైద్యులు, సామాజిక వేత్తలతో కలిసి ముందుగా బ్రోచర్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ… సరదాకి మొదలు పెట్టిన సిగరెట్టు,రోజు రోజుకు యువకులు, యువ తుల్లో ఒక స్టేటస్‌, స్టైల్‌గా మారిపోయిందనీ పొగాకు వాడ కం పెరిగిందని అన్నారు. గత 23 సంవత్సరాలుగా వరల్డ్‌ నో టొబాకో డే ప్రపంచ వ్యతిరేకదినోత్సవం, 13 సంవత్సరాలుగా పొగాకు వ్యతిరేక ఉద్యమన్ని (No Toba cco Month) కార్యక్రమాన్ని మే నెల 1వ తేది నుండి 31వ తేది వరకు నిర్వహించడం అభినందనీయమన్నారు.
అనంతరం డాక్టర్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో మే నెలంతా నగరంలో ముఖ్య ప్రాంతాలలో తిరిగి ప్రజలకు పొగాకుతో తయారు చేసిన సిగరెట్టు, చుట్ట, ఖైనీ, బీడి, గుట్కా, ద్వారా వచ్చే వ్యాధుల గురించి చెప్పటం, కరపత్రాలు, స్టిక్కర్స్‌ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రముఖ రచయిత సింగర్‌ పల్లె రవి మాట్లాడుతూ.. పోగాకుతో ప్రాణాంతకమైన జబ్బులు,బ్రెయిన్‌ స్ట్రోక్‌, ఆస్టియో ఆల్రైటీస్‌ సోరియాసిస్‌,ఉదర క్యాన్సర్‌ మొదలైన వ్యాధులకు గురి అవుతున్నరన్నారు. సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ సిగరెట్టు తాగి వదిలిన పొగను సెకండా హేండ్‌ పొగ లేక పాసివ్‌ స్మోక్‌ అని అంటారని.. సిగరెట్ను నేరుగా తాగిన పొగకంటే. ఒకరు పీల్చి ఒదిలిన పొగలో ఎక్కువ మోతాదులో విషపదార్థాలు ఉంటాయన్నారు. తాగిన వారి కంటే పీల్చుకున్న వారే అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు.