నేడు ఏబీవీపీ పాఠశాలల బందుకు పిలుపు

నవతెలంగాణ-భిక్కనూర్
ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు విద్యాసంస్థల బందుకు పిలుపునివ్వడం జరిగిందని ఏబీవీపీ కామారెడ్డి ఎస్ఎఫ్ఎస్ ప్రెసిడెంట్ గంధం సంజయ్ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని, యూనిఫాంలు, బుక్స్ త్వరగా అందించాలని, మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.