నేడు గాంధీనగర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో నిర్వహిస్తున్న హాథ్ సే హాథ్ జోడో యాత్ర లో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు హుస్నాబాద్ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు తెలిపారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండా అవిష్కరణ చేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక నెరవేర్చ బోయే హామీలను మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో ప్రజలకు వివరిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, రైతులు, యువకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని, కార్యక్రమాన్ని విజయ వంతం చేయలని కోరారు.