విద్యాసంస్థలకు నేడు సెలవు: విద్యామంత్రి సబిత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారీ వర్షాల నేపథ్యంలో శనివారం కూడా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం కూడా సెలవు ఉంటుందని స్పష్టం చేసింది.