నేడే ఇందల్ వాయి లో మంచి నీళ్ళు పండగ..

– హజరుకనున్న ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయి మండల కేంద్రంలో మంచినీళ్ల పండగ తాగునీటి విజయాలపై సభ కార్యక్రమం ఆదివారం ఉదయం 10:30 గంటలకు నీటి శుద్ధి కేంద్రం ఇందల్ వాయి జాతీయ రహదారి కి ఆనుకుని ఉంటుందని మండలం,నీయోజకవర్గం లోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపిటిసిలు ప్రజలు, యువకులు మహిళలు తరలి రావాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.