నేడే తిర్మన్ పల్లి లో కంటి వెలుగు శిబిరం ప్రారంభం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని గౌడ కమ్యునిటి భవనం లో శుక్రవారం ఉదయం ప్రారంభిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి టీ శ్రీధర్, ఇందల్ వాయి మండల విస్తరణ అధకారి శంకర్, ఎంపిటిసి చింతల దాస్ తెలిపారు.ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ఎంపిడిఓ రాములు నాయక్, ఎంపిఓ రాజ్ కాంత్ రావు లు పాల్గొనున్నరని వారన్నారు.ఈ కంటి వెలుగు శిబిరంలో 18 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష నిర్వహించడం జరిగుతుందని, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి కంటి పరీక్ష ఉచిత శిబిరానికి రప్పించే విధంగా చుడాలని, ఇప్పటికే గ్రామంలో ప్రచారం నిర్వహించామని పంచాయతీ కార్యదర్శి టీ శ్రీధర్ వివరించారు.అవసరం ఉన్న వారికి మోతే బిందు శస్త్ర చికిత్స కొరకు జిల్లా ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.