– ఈనెల 20న ఫైనల్ ‘కీ’, ఫలితాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఐసెట్ ప్రిలిమినరీ ‘కీ’ని సోమవారం విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ పి.వరలక్ష్మి తెలిపారు. దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 8వ తేది సాయంత్రం 5గంటల లోపు convener.icet@tsche.ac.in మెయిల్ ద్వారా పంపించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 20న ఫైనల్ ‘కీ’తోపాటు ఫలితాలను కూడా విడుద ల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే టీఎస్‌ఐసెట్-2023కు ప్రవేశ పరీక్ష మే 26,27 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. 80అబ్జర్వర్ల సమక్షంలో 72 టెస్ట్ సెంటర్లలో పరీక్ష నిర్వహిం చారు.75,925 మంది దరఖాస్తు చేసుకుంటే 70,900 మంది పరీక్ష రాశారు.