– ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలు ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఆనాటి యోధుల త్యాగాలను స్మరించుకోనున్నారు. హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ విలీనం-వాస్తవాలు అనే అంశంపై సభను నిర్వహించనున్నారు. సీపీఐ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా హాజరు కానున్నారు. వీటితో పాటు అన్ని జిల్లాలు, ముఖ్య పట్టణాల్లో సాయుధ పోరాట వార్షికోత్సవ సభలు నిర్వహిస్తారు. మరోవైపు గవర్నర్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ వద్ద గల పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.