నేడు సామాజిక తనిఖీ ప్రజావేదిక: ఎంపీడీవో

నవతెలంగాణ పెద్దవంగర: మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులపై నేడు కేజీబీవీ పాఠశాల పాత భవనంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నవంబర్ 2020 నుండి మార్చి 2023 వరకు చేపట్టిన వివిధ రకాల పనులపై సామాజిక తనిఖీ చేయనున్నట్లు చెప్పారు.