నేటి బాలలే రేపటి భారత దేశ నిర్మాణ పౌరులు

– మండల విద్యాధికారి ఆంధ్రయ్య 

– పాఠశాలల్లో బాలల దినోత్సవం వేడుకలు
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: నేటి బాలలే రేపటి భారత దేశ నిర్మాణ పౌరులని మండల విద్యాధికారి ఆంధ్రయ్య అన్నారు. భారత తొలి ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు పాఠశాలల్లో మంగళవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  మండలంలోని చౌట్ పల్లి, కమ్మర్ పల్లి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బాలల దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. చౌట్ పల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో మండల  విద్యాధికారి ఆంధ్రయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలంటే ఎంతో ఆసక్తి, ప్రేమను చూపించే నెహ్రును, చాచా నెహ్రూఅని పిలుస్తారని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్య, వారి సంక్షేమం కొరకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.నేటి బాలలే రేపటి భారత దేశ నిర్మాణ పౌరులని విద్యార్థులకు తెలిపారు. తల్లిదండ్రులకు గ్రామానికి దేశానికి మంచి పేరు తేవాలనిసూచించారు. అనంతరం పాఠశాలలో ఉపన్యాస, డ్రాయింగ్, పాటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లిలో ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, చౌట్ పల్లిలో ఇంచార్జి  ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య,  ఉపాధ్యాయులు బంతిలాల్, రాజు, మధుబాబు, సదుల్లా, ప్రవళిక, ప్రేమలత, పీఈటి నవ్య, జూనియర్ అసిస్టెంట్ గంగాధర్, సిఆర్పిలు అంజయ్య, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.