సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్
నవతెలంగాణ – జగద్గిరిగుట్ట.
భావితరాలకు దిక్సూచి నేటి విద్యార్థులేనని సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి ఈ. ఉమా మహేష్ అన్నారు. ఇటీవలే విడుదలైన ఇంటర్మీడియట్, పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకుల విద్యార్థులకు సీపీఐ ఆధ్వర్యంలో గురువారం జగద్గిరిగుట్ట, మగ్దూం నగర్ సీపీఐ కార్యాల యాలలో శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తున్న సభ్యులు దాదాపుగా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారేననానరు. అలంటి వారి పిల్లలు నేడు అధిక మార్కులు పొందడం తల్లిదండ్రులకు చాలా సంతోషమని, రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో రాణించి ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు నేడు సమసమాజ నిర్మాణం కోసం ఎలాగైతే పనిచేస్తున్నారో మీరు కూడా సమసమాజం కోసం పనిచేయాలని విద్యార్థులకు సూచిం చారు. ఇంకా కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తున్న వారు, తమ విధులను సక్రమంగా పనిచేస్తున్నారు కాబట్టే ప్రజలకు ఈ కొద్ది సమస్యలు పరిష్కారం అవుతున్నాయని లేదంటే మొత్తం ఉన్నోడి సమాజం గా ఏర్పడి అసమానతల సమా జం ఏర్పడుతుందన్నారు. రాబోయే కాంపిటీషన్ పరీక్షల్లో కూడా మంచి మార్కులు సంపాదించి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఇంటర్‌లో 983, 972 మార్కులు సాధించిన అక్షిత, నికిత,442 మార్కులు సాధించిన సందేశ్, పదో తరగతిలో 9.8 మార్కులు సాధించిన అభిరామ్, అరవింద్, యశ్వంతు లను సన్మానించారు .ఈ కార్యక్రమంలో పార్టీ మండల సహాయ కార్యదర్శి కత్తుల దుర్గయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు వి .హరినాథ్ రావు, ప్రజానాట్యమండలి కార్యదర్శి ఆకు బత్తిని ప్రవీణ్, ఉపాధ్యక్షుడు భాస్కర్ చారి, సీపీఐ నాయకులు వం గాల శ్రీనివాస్, చంద్రయ్య,సుధాకర్, ఇమామ్, మహ బూబ్,నరేందర్,శేఖర్,ఉపేందర్, అక్రమ్‌లు పాల్గొన్నారు.