నేడే తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో ఖాతాదారుల సమావేశం..

నవతెలంగాణ- డిచ్ పల్లి:
ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో ఖాతాదారులు, రైతులు, తదితరులతో సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నామని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రీజనల్ మేనేజర్ శ్రీ పురం నవీన్ కుమార్ హాజరవుతున్నారని ఖాతాదారులు సమయానికి పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని టీజీబీ గన్నారం మేనేజర్ టక్కూరు సంతోష్ గురువారం తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో ఇన్సూరెన్స్ కలిగి ఉండి మృతి చెందిన కుటుంబానికి రీజినల్ మేనేజర్ చేతుల మీదుగా చెక్కును అందజేయడం జరుగుతుందని, ఇదే కాకుండా బ్యాంకుల ద్వారా రైతు ఇతరత్రా రూణలను, వడ్డి తదితర అంశాలపై రీజినల్ మేనేజర్ క్లుప్తంగా వివరిస్తారని, ఉదయం 10గంటలకు బ్యాంకు లోనే సమావేశం ఉంటుందని బ్యాంకు మేనేజర్ సంతోష్ తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయన కోరారు.