టాప్లేకు గాయం ప్రపంచకప్‌కు

Injury to Tople to the World Cup– దూరమైన ఇంగ్లాండ్‌ పేసర్‌
ముంబయి : ఐసీసీ ప్రపంచకప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌కు టైటిల్‌ నిలుపుకునే క్రమంలో ఇక్కట్లు తప్పటం లేదు. ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన ఇంగ్లాండ్‌.. అఫ్గనిస్థాన్‌ చేతిలో చారిత్రక పరాజయంతో సరిపెట్టుకోలేదు. ముంబయి వాంఖడెలో దక్షిణాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో వన్డే చరిత్రలోనే దారుణ పరాజయం ఇంగ్లాండ్‌ మూటగట్టుకుంది. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా.. ఇంగ్లాండ్‌ తరఫున ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన పేసర్‌ రీసీ టాప్లే గాయానికి గురయ్యాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రీసీ టాప్లే ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. వైద్య పరీక్షల్లో టాప్లే బొటన వేలి ఎముక విరిగిందని తేలింది. టాప్లే స్థానంలో మరో పేసర్‌ను ఇంగ్లాండ్‌ త్వరలోనే ప్రకటిస్తుందని ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ వెల్లడించాడు. మోచేతి గాయం నుంచి కోలుకున్న జోఫ్రా ఆర్చర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతడిని ఎంపిక చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది.