కాంగ్రెస్ భవన్లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ- కంటేశ్వర్: పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చిన్న కార్యకర్త స్థాయి నుండి ఎంతో కృషితో కష్టపడి పనిచేస్తూ అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి అయ్యారని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అండగా ఉంటూ ధైర్యాన్ని నింపిన నాయకుడని, రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరెన్నో పదవులు చేకూరాలని వారు అన్నారు. నవంబర్ 30వ తేదీలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామర్తి గోపి , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు ప్రీతం, కార్పొరేటర్ ఘడుగు రోహిత్ ,నరాల నిహాల్, చింటూ, శోభన్, ఆవీణ్, వహీద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.