నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్ పోలీస్ స్టేషన్‌లో బిబిపేట్ మండలం నుండి బదిలీ పై వచ్చిన ఎస్సై సాయి కుమార్ ను టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం శాంతి భద్రతల పరిరక్షణకు పార్టీ నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంకం రాజు, తదితరులు పాల్గొన్నారు.