– సెస్ ఎండి గా సూర్యచంద్రరావు
నవతెలంగాణ- సిరిసిల్ల రూరల్
రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎండిగా పని చేసిన రామకృష్ణ బుధవారం బదిలీ అయ్యారు ఆయన స్థానంలో ఎండిగా సహకార శాఖ కు చెందిన సూర్యచంద్రరావు పదోన్నతి పై వచ్చారు ఎన్ పి డిసిఇఎల్ సిఇగా నిర్మల్ లో పనిచేస్తున్న క్రమంలో సిరిసిల్ల సెస్ ఎండిగా రామకృష్ణ బదిలీపై 2020 లో వచ్చి బాధ్యతలు తీసుకున్నారు 32 మాసాలు పనిచేసి మాతృ సంస్థకు బదిలీపై వెళ్లారు ఆయన గతంలోనీ 2014లో కూడా సిరిసిల్ల సెస్ ఎండిగా 16 మాసాలు పని చేశారు ప్రస్తుతం సిరిసిల్ల సిస్ ఎండిగా బదిలీపై వచ్చిన సూర్య చంద్రారావు గృహ నిర్మాణ శాఖలో జనరల్ మేనేజర్ గా పంచేదా ఆయనకు సహకార శాఖ జాయింట్ రిజిస్టర్ గా ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ సిరిసిల్ల ఎండిగా బదిలీ చేసింది.