ఈ సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలి

– బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌కు ఎస్జీటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయు ల బదిలీలు, పదోన్నతులను నిర్వ హించాలని ఎస్జీటీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ను ఆదివారం హైదరా బాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ షెడ్యూల్‌లోనే పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీసు పర్సన్లను నియమించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలకు ష్యూ, టై, స్కూల్‌ బ్యాగ్‌ ఉచితంగా ప్రభుత్వం అందించాలని కోరారు. కోర్టు తీర్పుతో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ఇస్తామని, సర్వీస్‌ పర్సన్లను నియమించడానికి కృషి చేస్తామని వినోద్‌కుమార్‌ హామీ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి పిల్లలకు పుస్తకాలు, వర్క్‌ బుక్‌లతోపాటు ష్యూ, బెల్టు, టై, స్కూల్‌ బ్యాగ్‌ ఉచితంగా ప్రభుత్వం అందించేలా కృషి చేస్తానన్నారని పేర్కొన్నారు.