నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయులకు పదోన్నతుల్లేని బదిలీలు చేపట్టడం సమంజసం కాదని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పదోన్నతులపై కోర్టు కేసు ఉన్నందున వాటి పరిష్కారానికి కొంత సమయం కేటాయించాలని కోరారు. పదోన్నతుల తర్వాతే బదిలీలు చేపట్టాలనీ, వీలు కాని పక్షంలో వేసవి సెలవుల్లో బదిలీ లు చేయాలని సూచించారు. అంతే తప్ప హడావుడిగా షెడ్యూల్ ప్రకటిం చడం సరైంది కాదని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కోర్టు కేసులతో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించాలని కోరారు. ఎవరికీ ప్రయోజనం లేని బదిలీల షెడ్యూల్‌ను నిలిపేసి పదోన్నతులు చేపట్టిన తర్వాతే నిర్వహించాలని సూచించారు.