జనగాం: రైలు నుంచి జారి పడి ఓ ట్రాన్స్‌జెండర్ దుర్మరణం చెందిన సంఘటన రఘునాథపల్లి రైల్వేస్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సంగెం మండలం ఎల్గూరుస్టేషన్ తూర్పుతండాకు చెందిన ట్రాన్స్‌జెండర్ బాదావత్ అనిల్ అలియాస్ దివ్య (25) సికింద్రాబాద్ నుంచి శాతవాహన రైలులో కాజీపేటకు వస్తుంది. దివ్య రఘునాథపల్లి రైల్వేస్టేషన్ రెండోప్లాట్‌ఫాంపై చేరుకోగానే నెమ్మదిగా రైలు వెళ్తున్న క్రమంలో కిందికి దిగబోతూ ప్రమాదవశాత్తు కాలుజారి రై లు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే రైలులో ప్రయాణిస్తున్న మృతుడి స్వగ్రామానికి చెందిన బాలు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ఘటనపై రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.