అటల్ బిహారీ వాజ్ పేయికి ఘన నివాళి..

నవతెలంగాణ-నవీపేట్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి మండల బీజేజీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా చేసిన సేవలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బందెల ఆనంద్, రామకృష్ణ, పిల్లి శ్రీకాంత్, రాజేందర్ గౌడ్, రాము, బాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.