బోయినపల్లి గోపాల్‌రావుకు నివాళి

– నవతెలంగాణ వరంగల్‌ రీజియన్‌ మేనేజర్‌గా పని చేస్తున్న ఆయన కుమారుడు
నవతెలంగాణ-వరంగల్‌
‘నవతెలంగాణ’ వరంగల్‌ రీజనల్‌ మేనేజర్‌ బోయినపల్లి దేవేందర్‌ రావు తండ్రి బోయినపల్లి గోపాల్‌రావు ఇటీవల మృతిచెందిన విషయం విధితమే. కాగా, వారి స్వగ్రామమైన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి తిమ్మాపూర్‌లో శుక్రవారం జరిగిన ఆయన దశదినకర్మకు ‘నవ తెలంగాణ’ సీజీఎం పి.ప్రభాకర్‌, మఫిషల్‌ ఇన్‌చార్జి వేణుమాధవ్‌, అడ్వర్టయిజింగ్‌ జనరల్‌ మేనేజర్‌ వెంకటేశ్‌, జనరల్‌ మేనేజర్లు భరత్‌, శశి కుమార్‌, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు వాసుదేవ్‌ హాజరై గోపాల్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. కార్యక్రమంలో ‘నవతెలంగాణ’ బుక్‌ హౌస్‌ మేనేజర్‌ బండారి బాబు, వరంగల్‌ జిల్లా రిపోర్టర్లు ఈర్ల సురేందర్‌, బవండ్లపల్లి కిరణ్‌ కుమార్‌, వెల్ది రాజేందర్‌, కందుకూరి సంజీవ్‌, సిబ్బంది శ్రీను, స్వామి తదితరులు పాల్గొన్నారు.