కాళోజికి నివాళి

 Tribute to Kalojiనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”చావు నీది పుటక నీది…. బతుకంతా దేశానిది” అన్న ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ భాషాద్యోమకారులు, పద్మభూషణ్‌ కాళోజి నారాయణరావు గొప్ప దేశభక్తులని… వారి మార్గంలో నవ, యువ కవులు ప్రయాణించాలనీ, పలుక బడుల భాషతో ప్రజా జీవనాన్ని సాహిత్యం ద్వారా అందించాలని తెలంగాణ సాహితి సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ఎంహెచ్‌ భవన్‌లో కవులు, రచయితలు, పాత్రికేయుల సమక్షంలో తెలంగాణ సాహితి అధ్యక్షులు వల్లభా పురం జనార్థన్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర సెక్రెటరియట్‌ సభ్యులు బి.రవికుమార్‌, నవతెలంగాణ ఇన్‌చార్జి ఎడిటర్‌ రాంపల్లి రమేష్‌, తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి, మోహన్‌ కృష్ణ, సలీమా, వహీద్‌ ఖాన్‌, ఖాజా మొయినుద్దీన్‌, గంగాధర్‌, రేఖ, మహేష్‌ దుర్గే, వెన్నెల సత్యం, ఏభూషి నర్సింహ, హథీరామ్‌ తదితరులు పాల్గొని కాళోజికి నివాళులర్పించారు.