దండోరా ఉద్యమ నాయకురాలు మెట్టుపల్లి విజయ మాదిగకి ఘన నివాళి

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజాంబాద్ జిల్లా అంబేద్కర్ అంబేద్కర్ కాలనీలో తన సొంత నివాసంలో ఎంఎంఎస్ మాదిగ మహిళ సమైక్యాలు విజయ మాదిగ అనారోగ్య కారణ వలన ఈ నెల 20-6-2023 రోజు మరణించిన సందర్భంగా 22-6-2023 నాడు నిజాంబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ గాదం నాగభూషణ్, దంపతి రాష్ట్ర నాయకులు చెన్నయ్య ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ ఎంపిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మహాజన నేత మాదిగల ముద్దుబిడ్డ బి ఎన్ రమేష్ కుమార్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. దండోరా ముద్దుబిడ్డ విజయ మాదిగ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ, వృద్ధుల వితంతువు పోరాటం, ఆరోగ్య శ్రీ కొరకు ఎన్నో ఉద్యమాలకు అలుపెరుగని పోరాటం చేసి అమరులైన విజయకు ఉద్యమాభివందనాలు అని తెలిపారు. అనేక కుల సంఘ నాయకులు, మాదిగ దండోరా రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల సునీల్ మాదిగ మాదిగ యునైటెడ్ ఫ్రంట్ కొంకరి భూమన్నం మాదిగ ఎంఎంఎస్ నాయకురాలు యమునా మాదిగ మాదిగ ఎంప్లాయ్ అసోసియేషన్ శ్రీనివాస్ సంతు తదితరులు కలిసి విజయ మాదిగ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని ఓదార్చే ఘన నివాళి అర్పించినారు.