
తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్. ఆరతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పలువురు పూలమాలాంకృతం చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్. ఆరతి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కొనసాగించిన విలువలను, ఉద్యమ స్ఫూర్తిని, సంఘటిత ఆలోచనలు, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని, మరింత ముందుకు తీసుకుపోవాలని పేర్కొన్నారు. విద్యారంగం పట్ల ఆచార్య జయశంకర్ దార్శని కథను గుర్తు చేశారు. విద్యారంగాన్ని పటిష్టంగా అమలు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగం పెంచాలని జయశంకర్ సార్ కలలను నిజం చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు డాక్టర్ శరత్, కేర్ టేకర్ సుధీర్, పీరు, రమేష్, సురేష్, సునీల్, బబ్లు, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.