ఉద్యోగ విరమణ పొందిన పోస్ట్ మాస్టర్ కు సన్మానం..

నవతెలంగాణ- భీమ్‌గల్:
మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన పోస్ట్ మాస్టర్ షేక్ అప్సర్ పదవి విరమణ పొందారు. ఈ పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోస్టల్ అసిస్టెంట్ సూపరిండెంట్ సురేఖ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ వస్తుందని అన్నారు. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ప్రజలకు అందించిన సేవలు చిరకాలం గుర్తుంటాయని అన్నారు. ఇంతకాలం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎలాంటి రిమార్క్ లేకుండా సేవలు అందించి రిటైర్మెంట్ పొందిన అప్సర్ ను అభినందించారు. పూలమాల వేసి శాలువా, మెమెంటో తో సత్కరించారు. ఈ కార్యక్రమం లో పిప్రి సర్పంచ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్,  ముచ్కూర్ సొసైటీ అధ్యక్షులు వెంకటేష్, ఉప సర్పంచ్ రాజేష్, మాజీ సర్పంచ్ రాజేందర్ గౌడ్, అరిగేల స్వామి, నీలం శంకర్, రౌతు భూమన్న, గుర్జి కింది రాజు, లింబన్న, రౌతు గంగాధర్, రౌతు గంగస్వామి, కారోబార్ ముత్తన్న, నిమ్మల నర్సయ్య, కిషన్ నాయక్, అజీమ్, భీంగల్ పోస్ట్ మాస్టర్ మదన్ లాల్, శేఖర్, దశరథ్, లింబా గౌడ్, భరత్, శ్రీనివాస్ రెడ్డి తో పాటు పోస్టల్ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.