నవతెలంగాణ – రామగిరి: తెలంగాణా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా అయిత ప్రకాష్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆయనను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ సత్కరించారు. రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రియల్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆశీస్సులతో హైదరాబాద్ లోని బషీర్ బాగ్ శక్కర్ భవన్ లో మంథని కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీటీసీ ఎల్లె రామ్మూర్తి , కమాన్పూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అన్వర్, తాజా మజీ సర్పంచ్లు తీగల సమ్మయ్య, ఎరుకల బాబురావు, మాజీ ఎంపిటిసి కొప్పుల గణపతి, మజీ సర్పంచ్ పెద్దపల్లి జిల్లా యూత్ నాయకులు గొర్రె నరేష్ యాదవ్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.