నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పదోన్నతిపై వచ్చి నూతనంగా బాధ్యతలు చేపట్టిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్నను మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సన్మానించారు. మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన సాయన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పదోన్నతి పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నల్ల గణేష్ గుప్తా మాట్లాడుతూ ఒక బీసీ ముద్దుబిడ్డ, గతంలో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉత్తమ సేవలు అందించి, మరల ఇదే పాఠశాలకు పదోన్నతిపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా బదిలీపై రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రధానోపాధ్యాయులు సాయన్న ఆధ్వర్యంలో పాఠశాలకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మ రాజేంద్ర ప్రసాద్, బుచ్చి మల్లయ్య, మారయ్య, తదితరులు పాల్గొన్నారు.