రోడ్డుకి కోమరయ్య కు ఘన నివాళులు..

నవతెలంగాణ -డిచ్ పల్లి

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ యూనివర్సిటీ లో మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు.కోమరయ్య భూమి భుక్తి విముక్తి కోసం నిరంతరం పోరాటం చేశాడని, అదేవిధంగా భారతదేశ చరిత్రలో అతి చిన్న వయసులో బ్రిటిష్ వారి పైన పోరాటం చేసి స్వతంత్రం సాధించడానికి తన వంతు పాత్ర పోషించారని,అయన చేసిన సేవలను కోనియాడారు.ఈ కార్యక్రమం లో  బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, సాయిబాబా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.