ప్రజాయుద్ద నౌక గద్దర్ చిత్రపటానికి నివాళి

నవతెలంగాణ -మద్నూర్
డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామంలో సోమవారం నాడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షులు విలాస్ గైక్వాడ్ మాట్లాడుతూ ప్రజా యుద్ధనౌక గాయకుడు గద్దర్ మరణం రాష్ట్ర ప్రజానీకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ నివాళిల కార్యక్రమంలో, ఉప సర్పంచ్ యాదవ్ రావు పటేల్, సామాజిక కార్యకర్త సాయలు గొండ, వార్డ్ మెంబెర్ దిలీప్ కుమార్, మాధవ్, ప్రజలు  నజిరసాబ్, పాషా మెస్త్రి , రోహిదాస్, రాజు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.