తండ్రి కలల సాకారం ‘ త్రిషా’…

గొంగడి త్రిషా… సరిగ్గా రెండేండ్ల కిందట రూ.10 లక్షల బేస్ ప్రైస్కు ఉమెన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కు వెళ్లిన ఆమెను ప్రాంచైజర్లు తిరస్కరించారు. అయినా ఏమాత్రం కుంగిపోలేదు. అవమానాన్ని ఆభరణంగా మలుచుకుంది. ఫలితం కోసం కాకుండా ప్రయత్నలోపం లేకుండా చూసుకుంది. తల్లిదండ్రుల కలను తన కలగా మలుచుకుంది. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన కన్నవారి నమ్మకాన్ని నిలబెడుతూ… మహిళా క్రికెటర్గా రాణిస్తోంది. గతనెలలో మలేషియాలో జరిగిన అండర్-19 ఉమన్ టీ-20 క్రికెట్ వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన మన తెలుగుతేజంతో ‘మానవి’ సంభాషణ…

గొంగడి త్రిషా 2005 డిసెంబర్ 15న భద్రాచలంలో పుట్టింది. తండ్రి రాంరెడ్డి కోరిక మేరకు రెండేండ్ల వయసులో బ్యాట్ పట్టిన ఆమె 17 ఏండ్లుగా రోజుకు 6-9 గంటల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తోంది. కృషితో నాస్తి మర్చిక్షం’ అని నమ్మింది. ఫలితం గురించి ఆలోచించకుండా.. ప్రయత్న లోపం లేకుండా… ఉత్తమ ప్రదర్శనివ్వటమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. డబ్ల్యూపీఎల్ లో రూ నేది లక్షల ప్రైస్ తనను ఏ ప్రాంచైజర్ తీసుకోకపోయినా ఏమాత్రం కుంగిపోకుండా మరింత పట్టుదలతో సాధన చేసింది. తల్లిదండ్రులు ఇచ్చిన గుండె దైర్యం, క్రీడాస్ఫూర్తితో 2026 టీ-20 అండర్-19 ఉమస్ వరల్డ్ కప్ అద్భుతాలు చేసింది.

నా పేరెంట్స్ నాకు ధైర్యం

నా పేరెంటే నాకు దైర్యం. పిల్లలను క్రికెటర్ ను చేయాలనేది మా నాన్న చిరకాలవాందే అబ్బాయి… అమ్మాయి. ఎవరుపుట్టినా క్రికెటర్ను చేయాలనుకున్నారు. అబ్బాయి పుట్టలేదని మా పేరెంట్స్ ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. నా ద్వారా వారి కలను నెరవేర్చుకోవాలనుకున్నారు. రెండు, రెండున్నర ఏండ్ల వయసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నాన్నే తొలిగురువుగా ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆరేదేండ్ల వయసులో హైదారాబాద్ షిఫ్ట్ అయ్యాం నాకోసం నాలుగు ఎకరాల భూమి అమ్ముకొని, జిమ్లో ఫిట్ నెస్ ట్రైనర్ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చారు. నెలకు రూ. లక్ష వరకు ఖర్చు పెట్టి ప్రాక్టీస్ చేయించారు. ఇవన్నీ చూశాక తన కోసం ఇంతలా శ్రమిస్తున్న తల్లిదండ్రుల ఆశలను. నెరవేర్చాలనే పట్టుదల పెరిగింది. అందుకే నా తొలి సెంచరీని మా నాన్నకు అంకితం ఇచ్చాను.

మిథాలీరాజ్ నాకు స్ఫూర్తి

ఫార్మర్ ఇండియా ఉమ క్రికెటర్ మిథాలీరాజ్ నాకు అభిమానించే క్రికెటర్ ఎంఎస్ ధోని, క్యాంప్ మిథాలీకి బౌలింగ్ చేయటం నాకో గ్రేట్ ఎక్స్పీరియన్స్ మెన్స్లో సచిన్ ఎలానో ఉమెన్స్ మిథాలిరాజ్ అలా అటువంటి ఆమె నన్ను అభినందిస్తూ పోస్టు చేయటం. ఎంతో గర్వకారణం తన తొని కోచ్ జాన్ మనోజ్ సర్కు నాపై ఎంతో విశ్వాసం ఉంది. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఆయన నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. నా ఫ్యామిలీ తర్వాత నన్నంతగా నపోర్టు చేసేది ఆయనే.

పేరెంట్స్ కట్ ఇప్పుడు నా కల…

మా పేరెంట్స్ నన్నో క్రికెటర్ చూడాలనుకున్నారు. అది వాళ్ల కల… కానీ నాకు మాత్రం పెయింటింగ్ ఇష్టముండేది. ప్లార్జింగ్ స్టేజీలో పొద్దుడే ప్రాక్టీస్కు వెళ్లాలంటే కొంత బద్ధకం అనిపించేది. ఉదయం ప్రాక్టీస్ చేసి సాయంత్రం బుక్ ల్కు వెళ్లి పెయింట్స్ తెచ్చుకొని బొమ్మలు వేసేదాన్ని కానీ ఒక ఏజ్ వచ్చాక.. అదీ హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా మంది ఉమెన్ క్రికెటర్లను చూశాక… అందర్- 14,16 సెలక్షన్స్ నాలో పోటీతత్వం పెరిగింది. క్రికెట్ కోసం ప్రత్యేక డైట్ను ఫాలో అవుతున్నాను. నాకోసం నాన్న ఆస్తులు అమ్ముకొని, జాబ్ వదిలివేసుకుని హైదరా బాద్ రావటం నా బాధ్యతను మరింతగా పెంచింది. ఐటీసీలో స్విమ్మింగ్ కోచ్గా నాన్న ఉన్నప్పటి నుంచి నాకు ఈతపైనా కొంత ఇంట్రస్ట్ ఏర్పడింది మొత్తమ్మీద పేరెంట్స్ కలే ఇప్పుడు నా కల. ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది.

ఆటనే ఆస్వాదిస్తా…

వరల్డ్, ఏషియా కెన్లో కెప్టెన్ వికీప్రసాద్, తనతోటి ఓపెనర్ కమిలినీ, నాతోటి తెలుగు క్రికెటర్ తిలా అందరం ఎంతో ఉండేవాళ్లం. ఆరునెలల పాటు అందరం కలిసి ఉండటంతో రూమ్ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉండేది. బ్రియన్ బారాతో లాస్ట్ వరల్డ్ కప్ లో అవార్డు తీసు కోవడం ఓ గొప్ప అనుభూతి. 2023 వరల్డ్కప్ కంటే ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలను కున్నారు. ఆ వరల్డ్కప్లో 97 రన్స్ వద్ద ఔటయ్యారు. ఈసారి చివరి దాకా ఉండి.. సెంచరీ చేయాలనే దృఢనిశ్చయంతో వెళ్లి. మాకోచెస్ నాకు ముందే చెప్పారు. వాళ్ళ మమ్మల్ని ఎంతో కంపర్డ్స్లో ఉంచారు. నారోల్ ఏంటో మా కోచ్ ఆర్. శ్రీధర్ చెప్పారు. ఓపెనర్గా వెళ్లి సెంచరీ కలసు కూడా నెరవేర్చుకున్నాను. నా కంటూ వేరే ఎంటర్టైన్మెంట్స్ లేవు. ఆటనే ఆస్వాదిస్తా…

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా 

త్రిషా గత నెల మలేషియాలో ఇరిగిన ఈ టోర్నమెంట్లో అనేక వికార్డులు నెలకొల్పింది. అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది. సూపర్క్స్లో స్కాట్లాండ్ల్పో చెలరేగి ఆదింది. కేవలం 50 బంతుల్లోనే 110 (13ఫోర్లు, 4 సిక్స్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో ముందుంచిన 83 పరుగుల ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.. దీనిలో త్రిషానే 44 పరుగులు చేసింది. బౌలింగ్లోనూ సత్తాచాటి మూడు వికెట్లు తీసి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషిం చింది. 2023 మహిళా అందర్-19 వరల్డ్్కన్లోనూ త్రిషా తన బాలెంట్ చూపింది. ఫైనల్లో 24 పరుగులతో అత్యధిక స్కోరర్గా నిలిచింది. ఇలా అనేక రికార్డులు సొంతం చేసుకున్న అల్ రౌండర్ త్రిషా తన లక్ష్యం ఇండియా సీనియర్ ఉమెన్ టీంలో చోటుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనను అభినందించటంపై త్రిషా పాఠం వెలిబుచ్చారు. ప్రభుత్వం తరఫున తనకు ఇచ్చిన రూ.కోటి పారితోషికాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు.

– కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి