నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎండలు తీవ్రంగా మండుతున్న సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట షెడ్యూల్‌లో స్వల్పమైన మార్పులు చేయాలని టీఎస్టీయూ అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే ప్రభుత్వ ఆలోచనకు ఆశయానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.