నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ లోయర్ గ్రేడ్) పరీక్షలు వచ్చేనెల 12న జరుగుతాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 42 రోజులపాటు నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరానికి హాజరైన అభ్యర్థులకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో జరుగుతాయని వివరించారు.